Amith Shah: సోమవారం మాయావతి, శుక్రవారం చంద్రబాబు రొటేషన్ పద్ధతిలో ప్రధాని అవుతారు: అమిత్‌షా

  • మహాకూటమిపై నిప్పులు చెరిగిన అమిత్ షా
  • మహాకూటమి అధికారంలోకి వస్తే, రోజుకొకరు ప్రధాని
  • పీఎం కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటున్నారు

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విపక్ష మహాకూటమిపై నిప్పులు చెరిగారు. నేడు బీహార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, మహాకూటమి అధికారంలోకి వస్తే, రోజుకొకరు ప్రధాని అవుతారని, ఆదివారం మాత్రం సెలవు అని ఎద్దేవా చేశారు.

మాయావతి సోమవారం ప్రధాని అని, మంగళవారం అఖిలేష్ యాదవ్, బుధవారం లాలూ ప్రసాద్ యాదవ్, గురువారం దేవెగౌడ, శుక్రవారం చంద్రబాబు, శనివారం స్టాలిన్ ప్రధాని అవుతారని చమత్కరించారు. కూటమిని సమర్థంగా నడిపే నాయకుడు లేనప్పటికీ రొటేషన్ పద్ధతిలో పీఎం కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

Amith Shah
Chandrababu
Mayavathi
Akhilesh Yadav
Stalin
Devegouda
  • Loading...

More Telugu News