Digvijay Singh: కాంగ్రెస్ సీనియర్ నేత డిగ్గీ రాజా సభలో మాట్లాడిన యువకుడికి బీజేపీ సన్మానం

  • మోదీ సర్జికల్ స్ట్రయిక్స్‌ను ప్రస్తావించిన అమిత్
  • ఉగ్రవాదులను మట్టు బెట్టారని వెల్లడి
  • వేదికపై నుంచి కిందకు దించేసిన కాంగ్రెస్ నేతలు

ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ లోక్‌సభ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ సభలో మాట్లాడిన యువకుడిని బీజేపీ సన్మానించింది. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా డిగ్గీ రాజా, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో డిగ్గీ రాజా పిలవడంతో జనంలో ఉన్న అమిత్ మాలి అనే వ్యక్తి వేదికపైకి వచ్చి మోదీ సర్జికల్ దాడులు నిర్వహించి ఉగ్రవాదులను మట్టుబెట్టారని ప్రశంసిస్తూ చెప్పడంతో కాంగ్రెస్ నేతలు కంగు తిన్నారు. వెంటనే అమిత్‌ను వేదికపై నుంచి కిందకు దించేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వీడియోను చూసిన బీజేపీ, అమిత్‌పై ప్రశంసలు కురిపించడమే కాకుండా అతన్ని తమ పార్టీ కార్యాలయానికి రప్పించి మరీ సన్మానించింది. ఈ సందర్భంగా అమిత్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ సభలో భాగంగా దిగ్విజయ్, ఎవరికైనా తమ అకౌంట్లలో రూ.15 లక్షలు జమ అయ్యాయా? అని ప్రశ్నించినపుడు తాను చెయ్యి పైకెత్తానని, దీంతో తనను వేదిక పైకి పిలిచారన్నారు. ఆ సమయంలోనే తాను సర్జికల్ దాడుల గురించి మాట్లాడటంతో తనను స్టేజిపై నుంచి కిందకు పంపేశారన్నారు. అయినప్పటికీ అక్కడున్న వారు ఎవరూ కూడా తనతో అనుచితంగా ప్రవర్తించలేదని అమిత్ తెలిపారు.

Digvijay Singh
Narendra Modi
Amith Mali
BJP
Congress
Surgical Strikes
  • Loading...

More Telugu News