CJI: న్యాయ వ్యవస్థను అస్థిర పరిచే కుట్ర జరుగుతోంది: జస్టిస్ అరుణ్ మిశ్రా

  • స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసే ఆరోపణలు తగదు
  • బెయిన్స్ అఫిడవిట్ పైనే విచారణ చేస్తున్నాం
  • దీంతో పాటు మాజీ ఉద్యోగిని ఆరోపణలపై సమాంతర విచారణ జరపాలి

సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ పై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. అలాగే, గొగోయ్ పై లైంగిక వేధింపుల కేసులో మహిళ తరఫున వాదించాలని, ఆయనకు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహిస్తే పెద్దమొత్తంలో తమకు డబ్బు ఇస్తామని ఓ వ్యక్తి ప్రలోభ పెట్టారని సుప్రీంకోర్టు న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించడం మరో సంచలనం.

ఈ నేపథ్యంలో జస్టిస్ అరుణ్ మిశ్రా స్పందిస్తూ, న్యాయ వ్యవస్థను అస్థిర పరిచే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసే ఆరోపణలు తీవ్రమైనవిగా పరిగణించారు. న్యాయవాది బెయిన్స్ అఫిడవిట్ పైనే ప్రస్తుతం విచారణ చేస్తున్నామని, ఆ అఫిడవిట్ తో పాటు మాజీ ఉద్యోగిని ఆరోపణలపై సమాంతర విచారణ జరుపుతామని ఆయన పేర్కొన్నారు.  

CJI
Ranjan gogoi
justce
Arun Misra
Bains
  • Loading...

More Telugu News