Rajasthan: నిద్రపోతున్న పులిపై రాళ్లువేసిన టూరిస్టు.. దిమ్మతిరిగే జరిమానా విధించిన టైగర్ రిజర్వ్ అధికారి!

  • రాజస్థాన్ లోని జైపూర్ లో ఘటన
  • రణతంబోర్ జాతీయ పార్కుకు వెళ్లిన టూరిస్టు
  • పులి ఫొటో తీసేందుకు ప్రయత్నం

టైగర్ రిజర్వు పార్కుకు వెళ్లిన ఓ టూరిస్టు పులిని చూడాలనుకున్నాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ క్రూర జంతువు ఫొటో తీసేందుకు దానిపై  రాళ్లు విసిరాడు. అయితే ఇది గమనించిన పులుల సంరక్షణాధికారి కొరడా ఝుళిపించాడు. సదరు పర్యాటకుడితో పాటు అతని గైడ్ గా వ్యవహరించిన వ్యక్తిపై భారీ జరిమానా విధించాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో చోటుచేసుకుంది.

జైపూర్ సమీపంలో ఉన్న రణతంబోర్ జాతీయ టైగర్ రిజర్వులో ఓ గైడర్ తో పాటు పర్యాటకుడు వచ్చారు. పార్క్‌లోని జోన్‌-6లో ఉన్న పిలిఘాట్ గేట్ నుంచి వీరు ఒక జిప్సీలో పార్క్‌లోకి ప్రవేశించారు. పార్క్ గురించి గైడర్ చెప్పే విషయాలు వింటూ అక్కడి ప్రదేశాలను, జంతువులను సదరు పర్యాటకుడు కెమెరాలో బంధిస్తున్నాడు. అంతలోనే అతనికి నిద్రపోతున్న ఓ పులి కనిపించింది.

అయితే దాన్ని ఎలాగైనా ఫొటో తీయాలని భావించిన ఆ టూరిస్ట్ పక్కనే ఉన్న కొన్ని రాళ్లు తీసుకుని దానిపై విసిరాడు. ఆ అలికిడికి ఒక్కసారిగా లేచిన పులి గట్టిగా గాండ్రించింది. దీంతో ఈ తతంగాన్ని స్థానిక పులుల సంరక్షణాధికారి గమనించాడు. పర్యాటకుడితో పాటు గైడర్ కు రూ.51,000 జరిమానా విధించాడు. దీంతో సరదా కోసం రాళ్లు విసిరిన సదరు టూరిస్టు భారీగా చేతిచమురును వదిలించుకున్నాడు.

Rajasthan
JAIPUR
RANTHAMPORE TIGER RESERVE
STONES ON SLEEPING TIGER
PENALTY
FINE
rs.510000
  • Loading...

More Telugu News