Telangana: ఉప్పొంగిన ‘కాళేశ్వరం’.. వెట్ రన్ విజయవంతం!

  • తొలి మోటార్ ను ప్రారంభించిన అధికారులు
  • ఉవ్వెత్తున ఎగజిమ్మిన నీరు
  • నందిమేడారం నుంచి నీటి ఎత్తిపోత

తెలంగాణ సాగునీటి రంగానికి మణిహారమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతమయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటుచేసిన భారీ మోటార్లలో మొదటి మోటర్ ఈరోజు విజయవంతంగా ప్రారంభమయింది.

తొలుత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం అధికారులు మోటర్ ను ఆన్ చేశారు. దీంతో ఒక్కసారిగా నీళ్లు ఉవ్వెత్తున ఎగజిమ్మాయి. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అధికారులు, స్థానికులు సంతోషం పట్టలేక కేకలు, ఈలలు వేశారు. నందిమేడారం సర్జ్ పూల్ లో ఉన్న నీటిని ఈ మోటార్లు ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News