Andhra Pradesh: ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఏసీబీ పరిధిలోకి వస్తారు: ఏసీబీ డీజీ వెంకటేశ్వరరావు
- అవినీతి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం
- ఏపీలో ప్రస్తుతం ఏసీబీ బలంగా ఉంది
- సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చు
ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీగా ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిని నిర్మూలించడం కేవలం ఏసీబీ వల్లే కాదనీ, దానికి ప్రజల నుంచి సహకారం కూడా అవసరమని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ఏసీబీ బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. అవినీతిపై ప్రజలు నేరుగానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు కూడా ఏసీబీ పరిధిలోకి వస్తారని వెంకటేశ్వరరావు చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతల ఫిర్యాదుతో వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీ బాధ్యతల నుంచి ఈసీ తప్పించిన సంగతి తెలిసిందే.