Chandrababu: క్రికెట్‌ మాస్టర్‌ సచిన్‌కు సీఎం చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు

  • ట్విట్టర్‌ ద్వారా మెసేజ్‌
  • మీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం
  • మీలాంటి వారుకొద్దిమందే ఉంటారని కితాబు

లిటిల్‌ మాస్టర్‌గా క్రీడాభిమానుల గుండెల్లో చిరస్థాయి ముద్రను సొంతం చేసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్‌, క్రికెట్‌ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మాస్టర్‌ తన 47వ పుట్టిన రోజును ఈరోజు జరుపుకొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్‌ మెసేజ్‌ పెట్టారు. ‘మీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఎందరో జీవితాలపై చెరగని ముద్రవేశారు. అది తరతరాలకు నిలుస్తుంది. మీలాంటి వారు కొద్దిమందే ఉంటారు’ అంటూ పేర్కొన్నారు.

Chandrababu
Sachin Tendulkar
Twitter
birthday wishes
  • Loading...

More Telugu News