Etala Rajender: కరీంనగర్ లో ఈటల రాజేందర్ ఇంటి ముట్టడి!

  • ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం
  • ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
  • చెదరగొట్టిన పోలీసులు

ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపిస్తూ, ఈ ఉదయం కరీంనగర్ లోని మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఈటల ఇంటి ముందు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు, వెంటనే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు, ఈటల ఇంటివద్ద ఉన్న విద్యార్థులను చెదరగొట్టారు.

Etala Rajender
Karimnagar
Students
Protest
  • Loading...

More Telugu News