Andhra Pradesh: అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం!

  • హాజరైన డీజీపీ ఠాకూర్, ఎన్నికల అధికారి ద్వివేది
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు హాజరు
  • కౌంటింగ్ ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ భద్రతపై సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, డీజీపీ ఆర్పీ ఠాకూర్, హోంశాఖ కార్యదర్శి అనురాధ హాజరయ్యారు. అలాగే జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏపీ అంతటా స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పరిస్థితుల గురించి సీఎస్ సుబ్రహ్మణ్యం అధికారులను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలనీ, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏపీలో సంక్షేమ పథకాల అమలుపై సీఎస్ సమీక్ష నిర్వహించడంపై మంత్రులు మండిపడుతున్న నేపథ్యంలో సీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం గమనార్హం.

Andhra Pradesh
CS LV SUBRAMANYAM
review meeting
AMARAVATI
  • Loading...

More Telugu News