Inter: ఇంటర్ తప్పిన మరో విద్యార్థి అత్మహత్య... 19కి చేరిన మృతులు!

  • మరో విద్యార్థి నిండు ప్రాణం బలి
  • ఉరేసుకున్న చాకలి రాజు
  • మెదక్ జిల్లాలో ఘటన

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం మరో విద్యార్థి నిండు ప్రాణాలను బలిగొంది. ఇంటర్ మూల్యాంకనంలో అవకతవకలు జరుగగా, ఇప్పటికే 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, నేడు మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల వచ్చిన ఇంటర్ ఫలితాల్లో తాను ఫెయిల్ కావడంతో, మెదక్ జిల్లా, చిన్నశంకరంపేట్ మండలం మడూర్‌ కు చెందిన చాకలి రాజు (18) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. చేతికి అందివచ్చిన కుమారుడు ఇలా దూరం కావడంతో రాజు తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కలుగజేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా మానసిక ధైర్యాన్ని నింపాలని బాధితులు కోరుతున్నారు.

Inter
Medak
Raju
Sucide
  • Loading...

More Telugu News