Telangana: సీఎం కేసీఆర్ ను తిడుతూ టిక్ టాక్ వీడియో.. యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు!

  • హైదరాబాద్ లోని రాచకొండలో ఘటన
  • సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడు
  • ఇప్పటికే టిక్ టాక్ పై దేశవ్యాప్త నిషేధం

తెలంగాణలో ఓ యువకుడు ఇబ్బందుల్లో పడ్డాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దూషిస్తూ ఓ వీడియోను తయారుచేసిన యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియోను టిక్ టాక్ యాప్ లో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ వ్యవహారాన్ని టీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాయి.

వెంటనే రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు ఫోన్ లొకేషన్, ఫేస్ బుక్ ఖాతా ఆధారంగా యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అశ్లీలతను ప్రోత్సహించేలా ఉందంటూ ఇటీవల దేశవ్యాప్తంగా టిక్ టాక్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో గూగుల్, యాపిల్ సంస్థలు తమ యాప్ స్టోర్స్ నుంచి దీన్ని తొలగించాయి. చైనాకు చెందిన ఓ కంపెనీ టిక్ టాక్ ను అభివృద్ధి చేసింది.

Telangana
KCR
ABUSE
Police
arrest
TRS
Hyderabad
rachakonda
tiktok
  • Loading...

More Telugu News