kcr: ఇంటర్ ఫలితాలపై కేసీఆర్ ఆగ్రహం.. చర్యలు తీసుకోవాలంటూ మంత్రికి ఆదేశం
- చర్యలు తీసుకోవాలంటూ జగదీశ్ రెడ్డికి ఆదేశం
- కమిటీ విచారణపై ఆరా
- ప్రాథమికంగా ఏం తేలిందని అడిగి తెలుసుకున్న కేసీఆర్
తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణపై కూడా ఆయన ఆరా తీశారు. విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ప్రాథమికంగా ఏం తేలింది? అనే విషయాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ మార్కుల్లో పలు అవకతవకలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 900లకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు సైతం కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ కావడం కలకలం రేపుతోంది. పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.