somireddy: ఆ మాట ఈసీ చెబితే తక్షణమే రాజీనామా చేస్తా: సోమిరెడ్డి

  • మంత్రులకు పని ఉండదని ఈసీని చెప్పమనండి
  • నిబంధనలు మాకూ తెలుసు
  • ఎన్నికల తర్వాత కూడా ఓటర్లను ప్రభావితం చేస్తామా?

ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు మంత్రులకు పని ఉండదని ఈసీ చెబితే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు నిరంతర ప్రక్రియ అని, ప్రజలకు బాధ్యత వహించడం తమ విధి అని చెప్పారు. అధికారం తమకు కొత్త కాదని, నిబంధనలన్నీ తమకు తెలుసని అన్నారు.

ఐదేళ్లు పాలించమని ప్రజలు తమను ఎన్నుకొన్నారని, జూన్ 8 వరకు తమ పదవీ కాలం ఉందని చెప్పారు. ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా తాము ఓటర్లను ప్రభావితం చేస్తామా? అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రద్దయితేనో, లేక ముఖ్యమంత్రి రాజీనామా చేస్తేనో ఆపద్ధర్మ ప్రభుత్వం వస్తుందని చెప్పారు.

తెలంగాణలో కూడా ఎన్నికల కోడ్ ఉందని... అక్కడ చోటు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం సమాధానం చెబుతుందా? లేక ఈసీ చెబుతుందా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

somireddy
Telugudesam
ec
  • Loading...

More Telugu News