Sakshi Singh: సీఎస్కే క్రికెటర్ మోను కుమార్ కు ముద్దిచ్చిన ధోనీ భార్య... మండిపడుతున్న నెటిజన్లు!

  • బట్టతల అధికంగా ఉన్న మోను
  • 'బంజరు భూమి' అంటూ నుదుటిపై ముద్దు
  • సాక్షి వైఖరి నచ్చలేదంటున్న ధోనీ ఫ్యాన్స్

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మోను కుమార్ కు ముద్దిస్తూ, తాను దిగిన ఫోటోను ధోనీ భార్య సాక్షి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెట్టడం ఇప్పుడు దుమారం రేపుతోంది. బట్టతల అధికంగా ఉండే మోను కుమార్ తలపై చెయ్యేసి ముద్దిచ్చిన సాక్షి, "బంజరు భూమి.. పచ్చదనం కోసం ఎదురుచూస్తోంది.. గడ్డి ఈ సైడ్‌ పచ్చగా లేదనుకుంటా" అని క్యాప్షన్ పెట్టింది. మోను కుమార్ బట్టతలపై సెటైర్ వేస్తూ, 'బీ పాజిటివ్' హ్యాష్ ట్యాగ్ ను ఆమె పోస్ట్ చేసినా, ధోనీ అభిమానులు మాత్రం హర్ట్ అయ్యారు.

సాక్షి ఈ తరహా పోస్ట్ పెట్టడంతో బాధపడుతున్నామని అంటున్నారు. సాక్షిని అన్ ఫాలో అవుతున్నామంటూ మెసేజ్ లు పెట్టడం మొదలు పెట్టారు. కొందరు మాత్రం పిచ్ చాలా ఫ్లాట్ గా ఉందని దీన్నో జోక్ గా తీసుకుంటున్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఇన్ స్టాగ్రామ్ వేదికగా మోను కుమార్, సాక్షి ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకుంటున్నారు. ఈ మధ్యనే సాక్షీ సింగ్, ఈ ప్రపంచంలోనే ఉత్తమ వదినంటూ మోను కుమార్ అనడం తెలిసిందే.

Sakshi Singh
MS Dhoni
Monu Kumar
Bald Head
Instagram
  • Loading...

More Telugu News