srilanka: శ్రీలంక ఉగ్రదాడిలో తెలుగు యువకుడి దుర్మరణం!

  • నగరంలో పైలెట్ శిక్షణ పొందుతున్న తులసీరాం
  • శ్రీలంకలో పర్యటిస్తుండగా ఉగ్రదాడి
  • శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మృతదేహం 

శ్రీలంకలో నేషనల్ తౌహీద్ జమాత్ ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండలో 321 మంది చనిపోయారు. దాదాపు 500 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో ఓ తెలుగు వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. హైదరాబాద్ లో పైలెట్ శిక్షణ పొందుతున్న తులసీరాం శ్రీలంకలో పర్యటిస్తుండగా ఉగ్రదాడి చోటుచేసుకుందని కొలంబోలోని భారత హైకమిషన్ తెలిపింది.

ఈ పేలుళ్లలో తులసీరాం ప్రాణాలు కోల్పోయాడని పేర్కొంది. అతని స్వస్థలం గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం రేవేంద్ర పాడు. కాగా, తులసీరాం మృతదేహాన్ని అందుకునేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు చేరుకున్నారు. మరోవైపు అతని మృతదేహం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

srilanka
terror attack
telugu man
tulasi ram
dead
samshabad
  • Loading...

More Telugu News