Andhra Pradesh: నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం!

  • జూన్ 12న తిరిగి తెరచుకోనున్న బడులు
  • సడలించిన నిబంధన
  • సర్క్యులర్ జారీ చేసిన విద్యా శాఖ

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులను ప్రకటిస్తూ, పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 50 రోజుల సెలవుల అనంతరం జూన్ 12న తిరిగి పాఠశాలలు తెరచుకుంటాయని ప్రకటించింది. గడచిన విద్యా సంవత్సరంలో కనీసం 220 రోజులు పని చేయాలన్న నిబంధనను చాలా పాఠశాలలు పూర్తి చేయకపోగా, ఎండలు, విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఆ నిబంధనను సడలిస్తూ పాఠశాల విద్యా కమిషనర్‌ కే సంధ్యారాణి నిన్న సర్క్యులర్‌ జారీ చేసి, దాన్ని డీఈఓలకు పంపారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకూ సెలవులు ఉంటాయని, ఈ సెలవుల్లో ఎటువంటి బోధనా కార్యక్రమాలనూ పాఠశాలలు చేపట్టరాదని ఆదేశించారు.

Andhra Pradesh
Schools
Holidays
  • Loading...

More Telugu News