Chandrababu: సీఎం సమీక్ష సమావేశంలో కలెక్టర్లను పొగడటం అనుమానాలకు తావిస్తోంది: కన్నా

  • రాష్ట్రంలో ఈసీ పూర్తిగా విఫలం
  • జేసీపై ఎలాంటి చర్యా తీసుకోరా?
  • ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు

ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్లను పొగడడం పలు అనుమానాలకు తావిస్తోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని, ఎన్నికల్లో రూ. 50 కోట్లు ఖర్చు చేశానన్న జేసీ దివాకర్ రెడ్డిపై ఎలాంటి చర్య తీసుకోరా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నికలు ఇంత వరకూ ఎప్పుడూ జరగలేదన్నారు. ఈవీఎంలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను చూస్తే అనుమానించాల్సి వస్తోందన్నారు.

Chandrababu
Collectors
Kanna Lakshminarayana
JC Diwakar Reddy
Election Commission
  • Loading...

More Telugu News