Vinay Varma: యాక్టింగ్ స్కూలు యజమాని వినయ్ వర్మను నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

  • 9 మందితో అసభ్యంగా ప్రవర్తించిన వినయ్ వర్మ
  • యువతి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం
  • సెక్షన్ 354 ఏ, 506, 509 ఐపీసీ కింద కేసులు

యాక్టింగ్ శిక్షణ పేరుతో తనను లైంగికంగా వేధించాడని, తలుపులు, కిటికీలు మూసేసి బట్టలు విప్పమని బలవంతం చేశాడంటూ ఓ యువతి యాక్టింగ్ స్కూల్ యజమాని వినయ్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

పోలీసు విచారణలో వినయ్ వర్మ తొమ్మిది మంది యువతులతో అసభ్యంగా ప్రవర్తించినట్టు తేలింది. అతను మాత్రం యువతులను బట్టలు విప్పమనడం నటనలో భాగమని సమర్థించుకున్నాడు. సెక్షన్ 354 ఏ నిర్భయ యాక్ట్, 506, 509 ఐపీసీ కింద వినయ్ వర్మపై కేసులు నమోదు చేసిన పోలీసులు నేడు అతనిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.  

Vinay Varma
Acting School
Police
Nampally Court
Nirbhaya Act
  • Loading...

More Telugu News