Telangana: తెలంగాణలో మరో విద్యార్థి ఆత్మహత్య!

  • వరంగల్ జిల్లాలోని నెక్కొండలో ఘటన
  • ఫస్ట్ ఇయర్ ఫెయిల్ కావడంతో మనస్తాపం
  • రైలు కింద పడి ఆత్మహత్య

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు తప్పుల తడకగా ఉండటంతో మనస్తాపం చెందిన  
విద్యార్థులు ఇప్పటికే పన్నెండు మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా, మరో సంఘటన వెలుగు చూసింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండకు చెందిన విద్యార్థి నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ కావడంతో మనస్తాపంతో చెందిన నవీన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్ ని రెడ్లవాడ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Telangana
Warangal
Nekkonda
intermediate
  • Loading...

More Telugu News