Telangana: తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలి: ‘జనసేన’ డిమాండ్
- ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలపై ఖండన
- ఇంటర్ విద్యార్థుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నాం
- మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
తెలంగాణలో ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ జనసేన ఇన్ చార్జి నేమూరి శంకర్ గౌడ్ ఓ ప్రకటన చేశారు. ఇంటర్ ఫలితాలలో లోపాలపై విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు వెంటనే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.