Kerala: మూడో దశ పోలింగ్‌లో అపశ్రుతి.. క్యూలైన్‌లో నిలబడి ప్రాణాలు కోల్పోయిన పలువురు!
- క్యూలైన్‌లోనే ప్రాణాలు కోల్పోయిన త్రిస్సయకుట్టి
- వడకారాలో ప్రాణం విడిచిన 64 ఏళ్ల వృద్ధురాలు
- అధికారులను ప్రశ్నిస్తూనే కుప్పకూలి చనిపోయిన మణి
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు జరిగిన మూడో దశ పోలింగ్‌లో పలు చోట్ల అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. కేరళలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన పలువురు వృద్ధులు క్యూలైన్లలోనే ప్రాణాలు కోల్పోయారు. వరప్పురంలో 87 ఏళ్ల త్రిస్సయకుట్టి వేలుపిళ్లై, పెజుంపరలో 86 ఏళ్ల చాకో మత్తయి సహా మరో ముగ్గురు లైన్లలో నిలబడి ఓటు వేసేలోగానే ప్రాణాలు కోల్పోయారు.
వడకారాలో 64 ఏళ్ల వృద్ధురాలు క్యూ లైన్లో వేచి చూస్తూనే ప్రాణం విడిచింది. అలాగే కొలికొల్లూరులో మణి(63) అనే వృద్ధురాలు ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై అధికారులను ప్రశ్నిస్తూనే కుప్పకూలి చనిపోయింది. మరోవైపు బెంగాల్ లోని బలిగ్రామ్ పోలింగ్ కేంద్రం వద్ద టీఎంసీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఓటు వేసేందుకు క్యూలైన్‌లో నిలబడిని వ్యక్తిని కొందరు కొట్టి చంపేశారు.