Mallu Bhatti Vikramarka: కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నా గవర్నర్ పట్టించుకోవట్లేదు: భట్టి

  • కేసీఆర్ ఒక పొలిటికల్ టెర్రరిస్ట్
  • పదవులకు రాజీనామా చేసి వెళ్లాలి
  • ఫిరాయింపులు క్విడ్ ప్రో కో కిందకే వస్తాయి

సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నా గవర్నర్ పట్టించుకోవట్లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ఒక పొలిటికల్ టెర్రరిస్ట్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ను వీడే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు.

పార్టీ ఫిరాయింపులు క్విడ్ ప్రో కో కిందకే వస్తాయన్న భట్టి, ఫిరాయింపులకు వ్యతిరేకంగా అన్ని వ్యవస్థలనూ ఆశ్రయిస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రజా పరిరక్షణ యాత్రలు చేపడతామని భట్టి పేర్కొన్నారు. ఈ యాత్రలను పినపాక నుంచి ప్రారంభిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తామని భట్టి వెల్లడించారు.

Mallu Bhatti Vikramarka
KCR
Governer
Congress
Pinapaka
Lokpal
  • Loading...

More Telugu News