sri lanka: శ్రీలంకలో ఉగ్రదాడులకు పాల్పడింది మేమే!: ఐసిస్ ప్రకటన

  • కొలంబోలో ఈస్టర్ పండగ రోజు విషాద ఘటన
  • చర్చిలు, స్టార్ హోటల్స్ లో బాంబు పేలుళ్లు మా పనే
  • అమాక్ న్యూస్ ఏజెన్సీ ప్రకటన

ఈస్టర్ పండగ రోజున శ్రీలంక రాజధాని కొలంబో బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన విషాద ఘటన తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్  ప్రకటించింది. ఈ మేరకు ఐసిస్ కు చెందిన అమాక్ న్యూస్ ఏజెన్సీ ఓ ప్రకటన చేసింది. కొలంబోలోని మూడు చర్చిలు, మూడు స్టార్ హోటల్స్ లో బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని పేర్కొంది. కాగా, కొలంబోలో పలుచోట్ల సంభవించిన పేలుళ్లలో 310 మంది వరకు మృతి చెందారు. ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు.

sri lanka
colombo
ISIS
amakh news Agency
  • Loading...

More Telugu News