Andhra Pradesh: ఆనం రామనారాయణరెడ్డికి బుర్ర ఉండే మాట్లాడుతున్నారా?: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

  • టీటీడీ బంగారం తరలించిన వ్యవహారంపై దర్యాప్తా?
  • ఆనం వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి
  • ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా తెలియని వాళ్లా బాబును విమర్శించేది!

చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి టీటీడీ బంగారం తరలించిన వ్యవహారంపై ఆనం రామనారాయణరెడ్డికి బుర్ర ఉండే మాట్లాడుతున్నారా? అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఆర్థిక శాఖామంత్రిగా పని చేసిన ఆనం, ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరడం విడ్డూరమని అన్నారు.

ఆనం రామనారాయణరెడ్డితో పాటు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణలు ఇంతగా దిగజారి మాట్లాడటం సబబు కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి, ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆనం, ఏ పార్టీలో ఉండగా ఏం మాట్లాడారో ఆయనకు గుర్తు ఉండటం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ కూడా తెలియని వ్యక్తులు చంద్రబాబును విమర్శిస్తున్నారని, ఈసీనీ అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని, వ్యవస్థలను నాశనం చేయాలని ప్రయత్నం చేయొద్దని సూచించారు.

Andhra Pradesh
YSRCP
Aanam
Telugudesam
somireddy
  • Loading...

More Telugu News