Andhra Pradesh: సీఎస్ తో రాష్ట్రాన్ని నడిపించాలనుకోవడం మంచిది కాదు: కోడెల

  • తనకు లేని అధికారాలనూ ఈసీ వినియోగించింది
  • ఎన్నడూ లేనివిధంగా హింసాత్మక ఘటనలు జరిగాయి
  • కేంద్రంలో, తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలో ఎందుకు?

ఈ ఎన్నికల్లో తనకు లేని అధికారాలనూ ఎన్నికల సంఘం వినియోగించిందని ఏపీ టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేనివిధంగా హింసాత్మక ఘటనలు జరిగాయని అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏది చెబితే అదే ఎలక్షన్ కమిషన్ చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో, తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలో ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో రాష్ట్ర్రాన్ని నడిపించాలనుకోవడం మంచిది కాదని సూచించారు. సత్తెనపల్లి వైసీసీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు ఓడిపోతే, ఇక జీవితంలో కనబడడని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Telugudesam
kodela
ambati
YSRCP
  • Loading...

More Telugu News