India: రాజకీయ నేతలు ప్రజలకు తాత్కాలిక ఆనందాలిచ్చే హామీలు ఇస్తున్నారు!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

  • ప్రజలకు కావాల్సింది అదికాదు
  • జీవనప్రమాణాలు మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలి
  • 65 శాతం యువ జనాభా ఉండటం మన వరం
  • చిత్తూరు ట్రిపుల్‌ ఐటీ మొదటి స్నాతకోత్సవంలో వెంకయ్య

దేశంలో రాజకీయ నాయకులు ఎన్నికల వేళ తాత్కాలిక ఆనందాలిచ్చే హామీలు ఇస్తున్నారని, కానీ అభివృద్ధికి కావాల్సింది తాత్కాలిక హమీలు కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజల జీవనప్రమాణాలు మెరుగయ్యేలా నేతలు రాజకీయాలు చేయాలన్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ ఐటీ మొదటి స్నాతకోత్సవానికి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో విద్యాసంస్థల సంఖ్యతో పాటు వాటి నాణ్యత కూడా పెరగాలని వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపువారేనని, అది మన బలమని వ్యాఖ్యానించారు. 2015లో కేంద్ర మంత్రి హోదాలో ఈ ట్రిపుల్‌ ఐటీకి తాను శంకుస్థాపన చేసిన విషయాన్ని వెంకయ్య గుర్తుచేసుకున్నారు. దేశంలో 900 విశ్వవిద్యాలయాలు ఉన్నాయనీ, అదే స్థాయిలో నాణ్యత ప్రమాణాలు కూడా పెరగాలని అభిలషించారు.

India
Andhra Pradesh
Venkaiah Naidu
Chittoor District
  • Loading...

More Telugu News