sudhakar: ప్రభాస్ చేతుల మీదుగా 'నువ్వు తోపురా' ట్రైలర్ రిలీజ్

- తెలుగు తెరకి మరో ప్రేమకథ
- కీలకమైన పాత్రలో నిరోషా
- మే 3వ తేదీన విడుదల
తెలుగు తెరపై ప్రేమకథల జోరు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అందువల్లనే ప్రేమకథా చిత్రాలు ఎక్కువగా నిర్మితమవుతూ ఉంటాయి. ప్రేక్షకులను పలకరించడానికి మరో ప్రేమకథ సిద్ధమవుతోంది. సుధాకర్ .. నిత్య నాయకా నాయికలుగా హరినాథ్ బాబు దర్శకత్వంలో 'నువ్వు తోపురా' సినిమా రూపొందింది. నాయకా నాయికలు ఇద్దరూ ఈ సినిమాతోనే పరిచయమవుతున్నారు.
