USA: అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం.. సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయిన శ్రావణ్!

  • బోస్టన్ బీచ్ వద్ద ఘటన
  • భారీ అల విరుచుకు పడటంతో ప్రమాదం
  • కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేత

అగ్రరాజ్యం అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన శ్రావణ్ కుమార్ రెడ్డి అమెరికాలోని బోస్టన్ లో చదువుకుంటున్నాడు. ఆదివారం ఈస్టర్ పర్వదినం సందర్భంగా స్నేహితులతో కలిసి బీచ్ కు వెళ్లాడు. సముద్ర తీరంలో ఈత కొడుతుండగా, భారీ అల ఒకటి విరుచుకుపడటంతో శ్రావణ్ కుమార్ మునిగిపోయాడు.

ఈ ఘటనలో అతని స్నేహితులు తప్పించుకోగలిగారు. శ్రావణ్ కనిపించకపోవడంతో స్నేహితులు వెంటనే కోస్ట్ గార్డ్ అధికారులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు గాలింపు జరపగా, శ్రావణ్ మృతదేహం లభ్యమయింది. మంచిర్యాల, వరంగల్ లో ఉన్న శ్రావణ్ కుటుంబ సభ్యులకు అధికారులు, స్నేహితులు సమాచారం అందజేశారు.

USA
telugu student
dead
bostan
sunk
Police
Telangana
Mancherial District
warangal
  • Loading...

More Telugu News