Uttar Pradesh: 'సైకిల్'కు ఓటేయాలని ఎన్నికల అధికారి సూచన.. పట్టుకుని చితకబాదిన బీజేపీ కార్యకర్తలు!

  • యూపీలోని మొరాదాబాద్ లో ఘటన
  • పోలింగ్ బూత్ 231 వద్ద ఎన్నికల అధికారి సూచన
  • తనపై అకారణంగా దాడిచేశారన్న పోలింగ్ అధికారి

ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఈరోజు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ 231 వద్ద ఓ ఎన్నికల అధికారి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి నసిర్ ఖురేషీకి ఓటేయాలని, సైకిల్ గుర్తుని నొక్కమని ఓటర్లకు చెప్పాడు. దీన్ని గుర్తించిన బీజేపీ కార్యకర్తలు సదరు ఎన్నికల అధికారిని పట్టుకుని చితకబాదారు.

దీంతో అక్కడ ఉన్న పోలీసులు సదరు అధికారిని బీజేపీ కార్యకర్తల దాడి నుంచి కాపాడారు. అనంతరం మొరాదాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఎన్నికల అధికారి స్పందిస్తూ.. తాను సమాజ్ వాదీ పార్టీకి ఓటేయాలని అసలు చెప్పనేలేదని వాపోయారు. తనపై బీజేపీ కార్యకర్తలు దాడిచేశారనీ, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

Uttar Pradesh
SP
POLLING OFFICER
ATTACKED
Police
BJP
Activists
  • Loading...

More Telugu News