wayanad: రాహుల్ నియోజకవర్గంలో రీపోలింగ్ కోసం డిమాండ్ చేసిన ఎన్డీయే అభ్యర్థి

  • వయనాడ్ లోని ఒక బూత్ లో ఈవీఎం సమస్య
  • రెండు సార్లు నొక్కినా పడని ఓటు
  • రీపోలింగ్ నిర్వహించాలని తుషార్ వెల్లపల్లి డిమాండ్

సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ వివిధ రాష్ట్రాల్లో ప్రశాంతంగా జరుగుతోంది. మరోవైపు, ఓ పోలింగ్ బూత్ లోని ఈవీఎంలో లోపాలు ఉన్నాయని, ఈ బూత్ లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్డీయే అభ్యర్థి తుషార్ వెల్లపల్లి డిమాండ్ చేశారు.

 మూపనాడ్ పంచాయతిలోని అరపట్ట గ్రామంలో ఉన్న బూత్ నంబర్ 79లో ఈవీఎం డ్యామేజ్ అయిందని.... రెండు సార్లు బటన్ నొక్కినా ఓటు పడటం లేదని ఆయన తెలిపారు. బటన్ ను పలుమార్లు నొక్కితే ఓటు ఇతరులకు పడే ప్రమాదం ఉందని చెప్పారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు.

భారత్ ధర్మ జనసేన (బీడీజేఎస్) పార్టీ అధినేతే తుషార్ వెల్లపల్లి. శ్రీ నారాయణన్ ధర్మ పరిపాలన యోగమ్ అనే సంస్థకు బీడీజేఎస్ అనేది రాజకీయ విభాగం. ఎన్డీయే కూటమిలో బీడీజేఎస్ భాగస్వామిగా ఉంది.

wayanad
kerala
evm
Rahul Gandhi
thushar vellapally
  • Loading...

More Telugu News