Srilanka: సెంట్రల్ కొలంబోలో మరో కలకలం.. 87 బాంబ్ డిటోనేటర్ల స్వాధీనం
- ‘శ్రీలంకన్ ముస్లిం’ సంస్థే మారణహోమానికి ఒడిగట్టింది
- నేటి అర్థరాత్రి నుంచి ఎమర్జెన్సీ
- సైన్యం చేతుల్లోకి ఉగ్రవాద వ్యతిరేక అధికారాలు
ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 290 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 500 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దారుణ ఘటనకు నిఘా వైఫల్యమే కారణమని శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. అలాగే ‘శ్రీలంకన్ ముస్లిం’ సంస్థే ఈ మారణహోమానికి ఒడిగట్టినట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ మారణహోమం జరిగిన మరుసటి రోజే మళ్లీ కలకలం రేగింది.
సెంట్రల్ కొలంబో బస్ స్టేషన్ నుంచి నేడు పోలీసులు 87 బాంబు డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నేడు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సారథ్యంలో జరిగిన భద్రతా మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేటి అర్థరాత్రి నుంచి ఎమర్జెన్సీ అమలు చేయాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద వ్యతిరేక అధికారాలను సైన్యం చేపట్టనుంది.