Andhra Pradesh: ఏపీ ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం

  • ‘ఇంటెలిజెన్స్’ నుంచి ఏబీ బదిలీ
  • ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ పదవి నుంచి ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల సమయంలో పక్కన పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా, వెంకటేశ్వరరావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు బదిలీ చేశారు. ఏసీబీ డీజీగా ఆయన్ని నియమిస్తూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జీవో నెంబర్ 882ను సీఎస్ విడుదల చేశారు. కాగా, ఏపీలో ఎన్నికలు ముగిసిన పదకొండు రోజుల తర్వాత ఏబీ వెంకటేశ్వరరావునే వేరే శాఖకు మారుస్తూ పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాగూరే ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

Andhra Pradesh
Inteligence
dg
vekateswara rao
  • Loading...

More Telugu News