jayaprada: మీ వ్యాఖ్యలు వింటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు: జయప్రద

  • జయప్రదను అనార్కలి అన్న అబ్దుల్లా
  • తండ్రికి తగ్గ కొడుకని మండిపడ్డ జయప్రద
  • మహిళలను మీరు చూసే విధానం ఇదేనా అంటూ మండిపాటు

తనను 'అనార్కలి'గా అభివర్ణించిన ఎస్పీ నేత ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లాపై జయప్రద మండిపడ్డారు. అబ్దుల్లా వ్యాఖ్యల పట్ల నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. తండ్రికి తగ్గట్టే కొడుకు కూడా ఉన్నాడని దుయ్యబట్టారు. విద్యావంతుడైన అబ్దుల్లా ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. 'మీ నాన్న నన్ను ఆమ్రపాలి అంటారు. నీవు నన్ను అనార్కలి అంటున్నావు. సమాజంలో ఉన్న మహిళలను మీరు చూసే విధానం ఇదేనా?' అని ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున జయప్రద పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెపై ఎస్పీ నేత ఆజంఖాన్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

jayaprada
azam khan
abdullah
  • Loading...

More Telugu News