amaravathi: వైసీపీవి పగటి కలలే...జగన్‌ ఎప్పటికీ సీఎం కాలేడు: మంత్రి నక్కా ఆనంద్‌బాబు

  • నకిలీ సర్వేల కోసం రూ.100 కోట్ల ఖర్చు
  • సీఎం చంద్రబాబు సమీక్షలపై విమర్శలు దారుణం
  • మోదీ, కేసీఆర్‌ సమీక్షలు చేయవచ్చా? అన్న మంత్రి 

అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్టు వైసీపీ నాయకులు పగటి కలలు కంటున్నారని, మే 23 తర్వాత వారి కలలు కల్లలవుతాయని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు జోస్యం చెప్పారు. వైసీపీ అధినేత జగన్‌ ఎప్పటికీ సీఎం కాలేరన్నారు. ఈరోజు అమరావతిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తామేదో అధికారంలోకి వచ్చేస్తామన్న ఆశతో వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలపై బురద చల్లుతున్నారని, దానికి ఎన్నికల సంఘం వంతపాడుతోందని విమర్శించారు.

 తామెన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఎన్నికల సంఘం వైసీపీ నాయకులు ఫిర్యాదు చేయడమే తరువాయి రంగంలోకి దిగుతుండడం వారి పక్షపాతానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు సమీక్షలను విమర్శిస్తున్న వైసీపీ నాయకులకు ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీక్షలు కనిపించడం లేదా? వారికి కోడ్‌ వర్తించదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ అధినేతగా ప్రజల నీటి ఎద్దడి సమస్యపై సీఎం సమీక్ష జరిపితే తప్పేంటని ప్రశ్నించారు.

amaravathi
YSRCP
Telugudesam
nakka anandababu
  • Loading...

More Telugu News