jayaprada: నియమావళి ఉల్లంఘన.. జయప్రదపై కేసు నమోదు చేసిన పోలీసులు

  • మాయావతిని ఆజంఖాన్ ఎక్కడెక్కడ చూశారన్న జయప్రద
  • సీరియస్ గా తీసుకున్న ఈసీ
  • ఈసీ ఆదేశాలతో కేసు నమోదు

ప్రముఖ సినీ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రదపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుంచి జయప్రద పోటీ చేస్తున్నారు. ప్రచారం సందర్భంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి, రాంపూర్ ఎస్పీ అభ్యర్థి ఆజంఖాన్ లపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాయావతిపై ఆజంఖాన్ ఎక్స్ రే కళ్లు వేసి ఎక్కడెక్కడ చూశారంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 18వ తేదీన ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈసీ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

jayaprada
case
azam khan
mayavati
  • Loading...

More Telugu News