azam khan: జయప్రదపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్ కుమారుడు

  • తండ్రి బాటలోనే పయనిస్తున్న అబ్దుల్లా
  • జయప్రదపై పరోక్ష వ్యాఖ్యలు
  • మాకు అనార్కలి వద్దంటూ కామెంట్

ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి ఆజంఖాన్ కు నోటి దురుసు ఎక్కువన్న సంగతి తెలిసిందే. కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆయనపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి జయప్రదపై కూడా ఇటీవల దారుణ వ్యాఖ్యలు చేశారు. ఖాకీ డ్రాయర్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు అబ్దుల్లా కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నట్టున్నాడు. పాన్ దరేబా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, జయప్రదపై పరోక్ష విమర్శలు చేశాడు. తమకు అలీ, భజరంగబలీలు కావాలి కాని... అనార్కలి వద్దంటూ వ్యాఖ్యానించాడు. 

azam khan
sp
jayaprada
abdullah
bjp
  • Loading...

More Telugu News