Hyderabad: రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రాజశేఖర్ డూప్‌కు గాయాలు

  • జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బైక్‌ను ఢీకొట్టిన కారు
  • తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు దంపతులు
  • ప్రమాదానికి కారణమైన కారు కోసం గాలిస్తున్న పోలీసులు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రాజశేఖర్‌కు డూప్‌గా కనిపించే ఆంజనేయులు, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందిరానగర్‌లో నివసించే ఆంజనేయులు భార్యతో కలిసి శనివారం రాత్రి ద్విచక్రవాహంపై గచ్చిబౌలి బయలుదేరారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వీరి బైక్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి వెళ్లిపోయింది.

ఈ ఘటనలో ఆంజనేయులు కాళ్లు, చేతులకు గాయాలు కాగా, ఆయన భార్య కూడా గాయపడింది. ఘటనపై ఆంజనేయులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Hyderabad
Jubilee hills
Actor Rajasekhar
Road Accident
  • Loading...

More Telugu News