Andhra Pradesh: టీటీడీ బంగారం రవాణా వివాదంపై విచారణ.. ఏపీ సీఎస్ ఆదేశాలు
- 1381 కిలోల బంగారం తరలింపు ఘటన
- విచారణాధికారిగా ప్రత్యేక సీఎస్ మన్మోహన్ సింగ్
- ఈ నెల 23 లోగా విచారణా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
ఈ నెల 17న చెన్నైలోని వెప్పంపట్టు సమీపంలో ఓ వాహనంలో తరలిస్తున్న 1381 కిలోల బంగారాన్ని ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ను విచారణాధికారిగా నియమించారు. మన్మోహన్ సింగ్ వెంటనే తిరుమల వెళ్లి విచారణ జరపాలని, బంగారం రవాణాలో భద్రతా లోపాలపై దర్యాప్తు చేయాలని, టీటీడీ, విజిలెన్స్ అధికారుల వ్యవహారం తీరుపై నివేదిక ఇవ్వాలని, ఈ నెల 23 లోగా విచారణా నివేదిక ఇవ్వాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు.