Telangana: తెలంగాణలో సైతం ‘జనసేన’కు కార్యకర్తలు అండగా నిలిచారు: నాదెండ్ల మనోహర్

  • అభ్యర్థుల గెలుపు కోసం పవన్ పాటుపడ్డారు
  • ఇది ఎన్నికల కోసం మొదలు పెట్టిన ప్రయాణం కాదు
  • నవతరానికి అవకాశం ఇవ్వాలన్నదే ఉద్దేశం

తెలంగాణలో సైతం తమ కార్యకర్తలు జనసేన పార్టీకి ఎంతో అండగా నిలిచారని ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన యువ అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పోలింగ్ సందర్భంగా అభ్యర్థులకు ఎదురైన అనుభవాలను తెలుసుకున్నారు. అనంతరం, నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, సమయం తక్కువగా ఉండటం వల్ల కొంత ఇబ్బందిపడినా, ఆరోగ్య సమస్య తలెత్తినా పట్టించుకోని పవన్ కల్యాణ్, తమ అభ్యర్థుల గెలుపు కోసం తన వంతు కృషి చేశారని అన్నారు. ఇది ఎన్నికల కోసం మొదలు పెట్టిన ప్రయాణం కాదని, నవతరానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో పవన్ ముందడుగు వేశారని మరోసారి ప్రస్తావించారు.

Telangana
janasena
Nadendla Manohar
  • Loading...

More Telugu News