pasupu-kumkum: ‘పసుపు-కుంకుమ’ ప్రభావం ఉండొచ్చనుకుంటున్నా: ఉండవల్లి అరుణ్ కుమార్

  • గతంతో చూస్తే జగన్ లో ఇంప్రూవ్ మెంటే ఉంది
  • నాడు టీడీపీతో ఉన్న బీజేపీ, జనసేన ఇప్పుడు లేవు
  • చంద్రబాబు హామీ మహిళలపై కచ్చితంగా పనిచేస్తుంది

‘పసుపు-కుంకుమ’ కింద మహిళలకు పదివేల రూపాయలు చంద్రబాబు ఇచ్చారన్న ఫీలింగ్ వారిలో ఉంటే వాళ్లే కాదు వాళ్ల కుటుంబసభ్యులు కూడా టీడీపీకే ఓటు వేస్తారని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘టీవీ9’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘పసుపు-కుంకుమ’ ప్రభావం పని చేసిందా?లేదా? అనే ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనని, అది తన స్థాయి కాదని చెప్పారు.

2014 నుంచి ఇప్పటి వరకూ చూస్తే జగన్ లో ఇంప్రూవ్ మెంటే ఉంది తప్ప, ‘డౌన్’ అయ్యేందుకు అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు విషయానికొస్తే, గతంలో టీడీపీకి మద్దతుగా ఉన్న బీజేపీ, జనసేన పార్టీలు ఈసారి లేవని, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే జగన్ పైచేయిలో ఉన్నాడని, చంద్రబాబు కింద ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

వీటన్నింటినీ మించి దేశంలో ఎక్కడా లేనట్టుగా ‘పసుపు-కుంకుమ’ కింద పది వేల రూపాయలు ఖాతాలో వేసి, మళ్లీ తామే అధికారంలోకొస్తే అదే మొత్తం వేస్తూనే ఉంటానని మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీ వారిపై కచ్చితంగా పనిచేస్తుందని అనుకుంటున్నానని ఉండవల్లి అన్నారు.

pasupu-kumkum
Undavalli
arun kumar
Telugudesam
  • Loading...

More Telugu News