Uttam Kumar Reddy: పోటీ చేసే అభ్యర్థులు రూ.20 బాండ్‌ పేపర్ పై ప్రమాణ పత్రం రాసివ్వాలి: టీ కాంగ్రెస్ స్పష్టం

  • ఉత్తమ్ నాయకత్వంలో సమావేశం
  • పార్టీని నేతలు వీడనున్నారనే ప్రచారంపై చర్చ
  • అధికారాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులకు అప్పగింత

తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.20ల బాండ్‌ పేపర్ పై ప్రమాణపత్రం రాసివ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది. నేడు గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి నాయకత్వంలో జరిగిన సమావేశంలో ప్రమాణ పత్రం తాలుకా ఫార్మాట్‌ను విడుదల చేశారు. అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చే అధికారాన్ని రాష్ట్రంలోని ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

'ఫారం-ఎ'లపై సంతకాలు చేసిన ఉత్తమ్ జిల్లా కలెక్టర్లకు ఇచ్చేందుకు వీలుగా ఓ ఫార్మాట్‌ను తయారు చేశారు. దానిని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు అందజేశారు.ఇక  ఈ సమావేశంలో ముఖ్యంగా మరో ముగ్గురు నేతలు కాంగ్రెస్‌ని వీడుతున్నారని జరుగుతున్న ప్రచారంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పార్టీ కీలక నేతలు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, జానారెడ్డి, కుసుమకుమార్ పాల్గొన్నారు.

Uttam Kumar Reddy
Jana Reddy
Mallu Bhatti Vikramarka
Shabbir Ali
Kusuma kumar
  • Loading...

More Telugu News