Priyanka Gandhi: అధ్యక్షుడు చెబితే నేను రెడీ.. వారణాసి నుంచి పోటీపై ప్రియాంక

  • వారణాసి బరిలో మోదీ
  • ఆమె కూడా అక్కడ బరిలోకి దిగుతారంటూ ప్రచారం
  • ప్రస్తుతం మోదీపై పోటీకి సిద్ధమని ప్రకటన

కాంగ్రెస్ పార్టీ తరుపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఇక ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోదీపై ఆమె పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె ఈ రోజు స్పందించారు.  

 ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షుడు, తన సోదరుడు రాహుల్ ఆదేశిస్తే వారణాసి నుంచి సంతోషంగా పోటీ చేస్తానని ప్రకటించారు. పలువురు ముఖ్య కాంగ్రెస్ నేతలు కూడా ఇదే కోరుకుంటున్నారు. మరి రాహుల్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Priyanka Gandhi
Rahul Gandhi
Narendra Modi
Congress
Varanasi
Uttar Pradesh
  • Loading...

More Telugu News