Sri Lanka: కొలంబో ఘటనలను ఖండించిన ప్రధాన మోదీ
- ఇలాంటి అనాగరిక సంఘటనలకు తావు లేదు
- శ్రీలంక ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నా
- మృతుల కుటుంబాలకు సానుభూతి
వరుస బాంబు పేలుళ్లతో కొలంబో దద్దరిల్లుతోంది. ఈరోజు ఉదయం మూడు చర్చిల్లో, మూడు హోటళ్లలో, తాజాగా మరో రెండు చోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. మన ఉపఖండంలో ఇలాంటి అనాగరిక సంఘటనలకు తావు లేదని, శ్రీలంక ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నామని, వారికి అండగా ఉంటామని అన్నారు. బాంబుపేలుళ్ల ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ కోరారు.