Andhra Pradesh: ఇది హేయమైన చర్య.. దీన్ని ప్రతీఒక్కరూ ఖండించాలి!: ఏపీ సీఎం చంద్రబాబు

  • శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు
  • 129 మంది దుర్మరణం, పలువురికి గాయాలు
  • బాధితులకు అండగా నిలవాలని బాబు పిలుపు

శ్రీలంక రాజధాని కొలంబోలో చర్చ్ లు, హోటళ్లే లక్ష్యంగా ఈరోజు వరుస బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 129 మంది చనిపోగా, 300 మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ దుర్ఘటనపై స్పందించారు. ఈ దాడిని హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ.. ‘ఈస్టర్ పర్వదినం నాడు శ్రీలంక రాజధాని కొలంబోలో చర్చ్ లు, హోటళ్లలో బాంబు దాడులు అత్యంత హేయనీయమైన చర్య. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇలాంటి దారుణ ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలి, బాధితులకు అండగా నిలబడాలి’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Twitter
srilanka attack
colambo
bomb attacks
  • Loading...

More Telugu News