sri lanka: శ్రీలంకలో పేలుళ్లకు కొన్ని నిమిషాల ముందే హోటల్ ఖాళీ చేశా: సినీ నటి రాధిక

  • సిన్నామన్ గ్రాండ్ హోటల్ లో బస చేశాను
  • ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నా
  • ఈ ఘటనను ఖండిస్తున్నా

శ్రీలంకలోని మూడు చర్చిలు, మరో మూడు స్టార్ హోటళ్లలో ఈరోజు పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పేలుళ్ల నుంచి ప్రముఖ సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ట్వీట్ లో తెలిపారు. సిన్నామన్ గ్రాండ్ హోటల్ లో తాను బస చేశానని, పేలుళ్లు సంభవించడానికి కొన్ని నిమిషాల ముందే హోటల్ ఖాళీ చేసి వెళ్లినట్టు ఆమె తెలిపారు. ఈ ఘటనతో షాక్ కు గురయ్యానని, ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నానని రాధిక పేర్కొన్నారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News