Tollywood: ఉపాసనకు అవార్డు రావడంపై స్పందించిన హీరో రామ్ చరణ్!

  • ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సేవలకు గుర్తింపు
  • భార్యపై ప్రశంసలు కురిపించిన టాలీవుడ్ నటుడు
  • ఫేస్ బుక్ లో సందేశం పోస్ట్ చేసిన రామ్ చరణ్

మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన ఇటీవల దాదా సాహెబ్ పాల్కే ఫిలాంత్రఫిస్ట్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక స్పృహ వంటి అంశాల్లో ఆమె చేసిన సేవకు గానూ ఉపాసనను ఈ అవార్డు వరించింది. దీంతో భార్యపై హీరో రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈరోజు ఫేస్ బుక్ లో రామ్ చరణ్ స్పందిస్తూ..'ప్రియమైన ఉప్సీ.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా' అంటూ ఆప్యాయంగా పోస్ట్ చేశాడు.

ఈ అవార్డు తనకు రావడంపై ఉపాసన స్పందిస్తూ..‘నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు మంచి పనులు చేసేలా శుభసందేశాలు పంపించే సానుకూల దృక్పథం ఉన్న నా ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నన్ను అన్నివిధాలా వెన్నంటి ఉండే నా ప్రియమైన కుటుంబానికి కృతజ్ఞతలు’ అని తెలిపారు.  

Tollywood
upasana
Ramcharan
Facebook
dadasheb falke
award
wish
  • Loading...

More Telugu News