klarthy: అమ్మానాన్నలూ.. పిల్లలకు ధైర్యం చెప్పండి.. మంచి మార్కులు సాధించడమే జీవితం కాదు!: హీరో కార్తీ

  • దేశవ్యాప్తంగా వెలువడుతున్న ఇంటర్, ప్లస్ టూ ఫలితాలు
  • మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న పిల్లలు
  • ట్విట్టర్ లో స్పందించిన కోలీవుడ్ హీరో

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో ఇంటర్, ప్లస్ టూ ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము కోరుకున్న మార్కులు రాలేదని చాలామంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ విషయమై ప్రముఖ నటుడు, హీరో కార్తీ స్పందించాడు. ఇలాంటి ఒత్తిడితో కూడుకున్న సమయంలో తల్లిదండ్రులంతా పిల్లలకు అండగా నిలవాలని కార్తీ కోరాడు. మంచి మార్కులే జీవితం కాదని వ్యాఖ్యానించాడు. పిల్లలకు అండగా ఉండి వారి ఒత్తిడిని దూరం చేయాలన్నాడు.

ఈరోజు ట్విట్టర్ లో కార్తీ స్పందిస్తూ.. ‘ప్రియమైన తల్లిదండ్రులకు.. ఇది పిల్లలకు చాలా ఒత్తిడితో కూడుకున్న సమయం. ఏదేమయినా మీరు వారి వెంటే ఉన్నామని పిల్లలకు ధైర్యం చెప్పండి. మంచి మార్కులు సాధించడమే జీవితం కాదు’ అని ట్వీట్ చేశాడు. దీనికి #Results #12thExam అనే హ్యాగ్ ట్యాగ్ లను జతచేశాడు.  

klarthy
kollywood
hero
12 th class results
students suicide
Twitter
request
  • Loading...

More Telugu News