Andhra Pradesh: ఒడిశాలో తెలుగు ఓట్లకు గాలం.. ‘క్రిమినల్’ సినిమాలో పాట పాడిన బీజేపీ నేత సంబిత్ పాత్ర!
- ఒడిశాలోని పూరీలో ఘటన
- తెలుగు ఓటర్లను ఆకట్టుకునే వ్యూహం
- ఈలలు, కేకలతో ప్రోత్సహించిన మద్దతుదారులు
సాధారణంగా రాజకీయ నేతలు అన్నాక ఓట్ల కోసం రకరకాల ఫీట్లు చేస్తుంటారు. కొందరు చీపుర్లు పట్టుకుని వీధులు చిమ్మితే, మరికొందరు కత్తెర-దువ్వెన పట్టుకుని కటింగ్ చేస్తుంటారు. మరికొందరేమో దోసెలు వేయడం, ఇడ్లీలు తీయడం వంటి పనులు చేస్తుంటారు. కానీ బీజేపీ అధికార ప్రతినిధి, ఒడిశాలోని పూరీ లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్న సంబిత్ పాత్ర మాత్రం కాస్త డిఫరెంట్. పూరీలో తెలుగువారి సంఖ్య గణనీయంగా ఉంది.
ఈ నేపథ్యంలో తెలుగువారిని ఆకట్టుకోవడానికి సంబిత్ పాత్ర ఏకంగా మైక్ పట్టారు. బీజేపీ ఎన్నికల ప్రచార సభలో హీరో నాగార్జున-మనీషా కొయిలారా జంటగా నటించిన ‘క్రిమినల్’ సినిమాలో ‘తెలుసా-మనసా.. ఇది ఏనాటి అనుబంధమో’ అనే పాటను పాడేశారు. ఈ పాటకు సంబిత్ గొంతు చక్కగా సరిపోవడంతో మద్దతుదారులు, ప్రజలు ఈలలు, కేకలు వేస్తూ ఆయన్ను ప్రోత్సహించారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.