Narendra Modi: మోదీని పశ్చిమ బెంగాల్ నుంచి బరిలోకి దిగమంటున్న రాష్ట్ర నేతలు

  • వారణాసి నుంచి పోటీ చేస్తున్న మోదీ
  • మమతను ఢీకొట్టేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి కూడా బరిలోకి దింపే యత్నం
  • మోదీ సుముఖంగా ఉన్నారంటున్న నేతలు

పశ్చిమ బెంగాల్‌లో గట్టి పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. ప్రధాని నరేంద్రమోదీని అక్కడి నుంచి బరిలోకి దింపేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి బరిలో ఉన్న మోదీని  పశ్చిమ బెంగాల్‌లోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించేందుకు ఆ రాష్ట్ర నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా ఇక్కడి నుంచి మోదీని పోటీలోకి దింపాలని యోచిస్తున్నట్టు ఆ పార్టీ నేత ముకుల్ రాయ్ పేర్కొన్నారు. తమ కోరికను ప్రధాని ముందు ఉంచామని, ఆయన ఏమీ చెప్పనప్పటికీ తమ అభ్యర్థనను మన్నిస్తారనే భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

పశ్చిమబెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 12, 19న చివరి రెండు విడతల పోలింగ్ జరగనుంది. దక్షిణ దీనాజ్‌పూర్‌లోని బునియాద్‌పూర్‌లో మోదీని కలిసిన రాయ్ తన కోరికను ఆయన ముందు ఉంచారు. రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ద్వారా రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయవచ్చని ఆయనకు వివరించారు.  

  • Loading...

More Telugu News