West Godavari District: గుడివాడలంకలో అసభ్యకర నృత్యాలు.. ఆరుగురు యువతుల అరెస్ట్

  • రికార్డింగ్ డ్యాన్స్ పేరుతో అసభ్య నృత్యాలు
  • 18 మంది అరెస్ట్
  • పోలీసులతో నిర్వాహకుల వాగ్వివాదం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని గుడివాడలంకలో శుక్రవారం రాత్రి రికార్డింగ్ డాన్స్ పేరుతో అసభ్యకర నృత్యాలు చేస్తున్న ఆరుగురు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుడివాడలంకకు తణుకు సమీపంలోని వేల్పూరుకు చెందిన యువతులను తీసుకువచ్చి రికార్డింగ్ డ్యాన్స్ పేరుతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం  అందింది. దీంతో అర్ధరాత్రి దాడి చేసిన పోలీసులు మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో నిర్వాహకులు మోరు ధర్మరాజు, జయమంగళ పెద్దిరాజు, 8 మంది గ్రామ పెద్దలు, ఆరుగురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. కాగా, ఇక్కడ అసభ్యకర నృత్యాలు జరగడం లేదని, వెంటనే అదుపులోకి తీసుకున్న వారిని వదిలేయాలంటూ ఏలూరు రూరల్ పోలీసులతో నిర్వాహకులు వాగ్వివాదానికి దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

West Godavari District
Recording dance
girls
Police
Andhra Pradesh
  • Loading...

More Telugu News